తిరగబడుతున్నారు.. ఏకంగా 20 మంది సైనికులను చంపేశారు..?
ఈ క్రమంలోనే రోజు రోజుకి పాకిస్తాన్లో పరిస్థితిలు మారిపోతున్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్ రాజకీయాల్లో కూడా పరిణామాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. పూర్తిగా ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో ఆర్మీలో కూడా వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా అసలు ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్, గిల్గిట్ బాల్టిస్థాన్, సింధు ప్రావిన్స్ ప్రజలందరూ ప్రస్తుతం పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తిరగబడుతున్నట్లు తెలుస్తోంది.
తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని దానికి భారత సహకారం అందించాలి అంటూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి ఆయా దేశాలు. ఈ క్రమంలోనే ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న. ఇక ఇటీవలే బెలూన్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడిలో ఏకంగా 20 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చైనా కు సంబంధించిన సైనికులు కూడా బెలూచిస్తాన్ ఫ్రీడమ్ ఫైటర్స్ దాడిలో మరణించినట్లు తెలుస్తోంది. ఇది పాకిస్థాన్లో తాజాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పతాకస్థాయికి చేరుకున్నాయి అనేదానికి ఈ ఘటన నిదర్శనం అని విశ్లేషకులు అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి.