కిలో చికెన్ ధర రూ.1400.. అంత డిమాండ్ ఎందుకంటే..?
సీజన్ తో సంబంధంలేకుండా చికెన్ మటన్ కు ఎంతో డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. అయితే మామూలుగా కొన్నిసార్లు చికెన్ మటన్ ధరలు ఆకాశాన్నంటుతు ఉంటాయి అనే విషయం తెలిసిందే. దీంతో సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతుంటారు. అయితే మామూలుగా చికెన్ ధర 200 నుంచి 300 రూపాయల మధ్య ఉంటుంది. కానీ చికెన్ ధర ఏకంగా కిలో కి 14 వందల రూపాయలు అంటే ఎవరైనా నమ్ముతారా. చికెన్ కిలో ధర 1400 ఏంటండీ... 300 లోపల ఉంటుంది అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ చికెన్ ధర మాత్రం 1,400 రూపాయలు.
మరి ఆ కోడి అలాంటి ఇలాంటి కోడి కాదండోయ్... ఎంతో పోషకాలు కలిగిన కడక్ నాథ్ కోడి అందుకే కోడి మాంసానికి అంతలా డిమాండ్. కడక్ నాథ్ కోళ్లకు తెలుగు రాష్ట్రాల్లోనూ డిమాండ్ పెరిగిపోతోంది. మధ్యప్రదేశ్కు చెందిన ఈ ప్రత్యేకమైన కోడి రంగుతో పాటు మాంసం కూడా పూర్తిగా నల్లగానే ఉంటుంది. ఇక సాధారణ గుడ్ల తో పోలిస్తే ఈ కోళ్ళ యొక్క గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంది కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కోళ్లను నల్ల బంగారం అని పిలుస్తూ ఉంటారు. కాగా ఈ కోడి గుడ్డు ధర 50 రూపాయలు పలుకుతుండగా ఈ కోడి మాంసం ధర ఏకంగా 14 వందల రూపాయల వరకు పలుకుతుందట. ఇక ఈ కోళ్లకు డిమాండ్ పెరిగిపోతుండడంతో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఈ కోళ్ల వ్యాపారం చేపడుతూ భారీగా ఆదాయం పొందుతున్నారు.