ఇలా చేస్తే ఈ సమస్యలు వెంటనే తొలగిపోతాయి....!

Suma Kallamadi
మనం సహజంగా ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటాం. అయితే కేవలం ఈ ఒక్క పదార్ధం తో అనేక సమస్యలని తొలగించవచ్చు. మరి అదేమిటో.....? దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడే చూసేయండి. లవంగాల లో అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంది. మీకు తీవ్రమైన పంటి నొప్పి ఉంటే, మీరు వైద్యుడి వద్దకు వెళ్ళే వరకు బాధాకరమైన ప్రదేశంలో లవంగం కొరికి పట్టండి. పంటి నొప్పి వల్ల కలిగే అసౌకర్యాలను వదిలించుకోవచ్చు.

రోజూ లవంగం తింటే శరీరానికి చాలా మంచిది. ఈ  లవంగాల లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలానే వీటి లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ మరియు యాంటీ మైక్రోబియల్ వంటి గుణాలని కూడా కలిగి  ఉంటుంది. అంతే కాదండి  ఇన్ఫెక్షన్ల తో పోరాడటానికి కూడా సహాయ పడుతుంది. వాటిలో విటమిన్ సి కూడా ఉంటుంది.  లవంగాలని తీసుకుంటే రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. రోగ నిరోధక వ్యవస్థకు తోడ్పడటానికి మనం తినే ఉత్తమమైన ఆహారాల లో లవంగం ఒకటి అనే అనాలి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతాయి.

కేవలం రోగ నిరోధక శక్తి మాత్రమే కాదు జీర్ణ క్రియను కూడా ఇది మెరుగు  పరుస్తుంది. జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కనుక  పొందలంటే  లవంగమే బెస్ట్. ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. అలానే దీనిని తీసుకోవడం వల్ల  వికారం తగ్గిస్తుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు మల బద్దకాన్ని నివారిస్తుంది. ఇలా జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే  లవంగ పొడిని తేనెతో కలిపి తినవచ్చు. చూసారా లవంగం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. కేవలం రుచికి మాత్రమే కాదు. అనారోగ్య సమస్యలకి కూడా ఇది చాలా మంచిది. కాబట్టి వీటిని ఈ సమస్యలకి కూడా ఇక ఉపయోగించేయండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: