చేనుకు కంచెగా మారిన బతుకమ్మ చీరలు.. ప్రశ్నిస్తే సమాధానం ఏంటో తెలుసా..?

praveen
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత... బతుకమ్మ పండుగను రాష్ట్ర అధికారిక పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా మిరుమిట్లు గొలిపే విధంగా బతుకమ్మ పండుగను ఎంతో సర్వాంగసుందరంగా నిర్వహిస్తూ ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం. బతుకమ్మ పండుగ కోసం ఏకంగా వందల కోట్లు ఖర్చు పెడుతూ ఉంటుంది. ఇక బతుకమ్మ పండుగ వచ్చిందంటే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సందడి నెలకొంటుంది అన్న విషయం తెలిసిందే. ఆడపడుచులు అందరూ కొత్త బట్టలు ధరించి బంతి పూలతో బతుకమ్మను చేసి  తొమ్మిది రోజులపాటు ఎంతో ఉత్సాహంతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు.



 ఇకపోతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగకు ఆడపడుచులందరు కొత్త చీరలు ధరించాలి అనే ఉద్దేశంతో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ప్రతి యేడు లాగానే ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కూడా అధికారులు ఎంతో కసరత్తులు చేస్తూ బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నారు. అయితే బతుకమ్మ చీరలు కొంత మంది ఆడపడుచులు కుటుంబాల్లో  బతుకమ్మ చీరలను వింతగా ఉపయోగిస్తూ ఉండటం గమనార్హం. బతుకమ్మ చీరలు గ్రామంలో ఏకంగా తోటకు కంచె  గా మారిపోవడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.



 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం లోని గండి పేట గ్రామంలో ఓ వ్యక్తి తన ఇంటి వద్ద ఉన్న తోటకు బతుకమ్మ చీరలను కంచెగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇదేంటి అని  ప్రశ్నిస్తే గత ఏడాది వచ్చిన బతుకమ్మ చీరలు వాడకుండా అలాగే ఉంచామని అందుకే ప్రస్తుత ఇలా వాటిని ఉపయోగించినట్లు చెప్పుకొచ్చాడు. కాగా చేనేత కార్మికులను ప్రోత్సహించి ఆడపడుచులకు కొత్తబట్టలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ ఏడాది ఈ నెల 17వ తేదీన బతుకమ్మ ఈ పండుగను పురస్కరించుకుని ఇప్పటికే చీరల పంపిణీ మొదలైన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: