తెలంగాణలో ఒకవైపు కరోనా.. మరోవైపు భారీ వర్షాలు..వణికిపోతున్న ప్రజలు..
ఇది ఇలా ఉండగా ఇప్పుడు కరోనా ప్రభావం పెరుగుతుందని తెలంగాణ సర్కార్ బాంబును పేల్చింది. ఇటీవల కరోనా కేసులు గురించి వివరాలు చెప్పలేదని హైకోర్టు మండి పడటంతో తెలంగాణ సర్కార్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఆదివారం కావడంతో టెస్టుల చేసే సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. దాంతో కేసుల సంఖ్య కూడా తక్కువగానే నమోదు అయ్యింది. నిర్వహించిన పరీక్షల్లో కేవలం వెయ్యి కేసులు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో కరోనా పాజిటివ్ కేసులు 1700 లకు పైగా నమోదు అయ్యాయి.ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,14,792 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 5 గురు మరణించారు. ఇప్పటి వరకు 1233 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 24,208గా ఉన్నాయి. వారిలో 19,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 189351 మంది కరోనా తో పోరాడుతున్నారు. రికవరీ రేటు 88.15% శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 86.8% శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.57 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 46,835 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 36,24,096 పరీక్షలు చేసారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి..