విజయవాడలో దారుణం.. తుపాకీ కాల్పుల కలకలం..
ఇప్పుడు విజయనగరం లో, విజయవాడbలో నేర చరిత్ర బయట పడుతుంది. ఇటీవల విజయవాడ లో సంచలనంగా మారిన ఘటన మహేష్ హత్య . ఈ కేసు తల నొప్పిగా మారింది. అతని హత్య కేసులో పోలీసులు విచారణ ను ముమ్మరం చేశారు. మలుపుల మద్య కేసు తిరుగుతుంది. ఇప్పటికే పోలీసులు కీలక సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు లో వాడిన గన్ తో పాటుగా కొన్ని ఆధారాలను ఇన్నాళ్లకు పోలీసులు చేధించారు.
ఈ హత్య చేయడానికి ఉపయోగించిన గన్ లో 6 ఎమ్ ఎమ్ బుల్లెట్స్ ను వాడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులకు ఈ కేసు పై మరి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఈ కోణంలో పూర్తి వివరాలను సేకరించి పనిలో ఉన్నారు. తుపాకీ ఎక్కడ్నుంచి వచ్చింది..? ఎవరు ద్వారా తెచ్చారు..? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అంతేకాదు హత్యకు ప్రధాన కారణం రియల్ ఎస్టేట్ వ్యవహరమా..? అక్రమ సంబంధమా..? మరేయితర కారణాలున్నాయన్న కోణంలో ఎంక్వైరీ కొనసాగుతుంది. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..