మీరు దిండు పెట్టుకునే నిద్ర పోతున్నారా...? అయితే ఈ సమస్యలు మీకు తప్పవు...!
సడన్గా మానేయకూడదు కానీ క్రమంగా మానేయచ్చు. ఎలా అంటే...? దానికి ఒక విధానం ఉంది. మరి చూసేయండి... దిండ్లు పెట్టుకుని నిద్రించే అలవాటును పోగొట్టుకోవాలంటే మొదట రెండు, మూడు వారాల వరకు తల కింద దిండు కాకుండా ఓ టవల్‌ను మడిచి పెట్టుకుని నిద్రించాలి. ఆ తర్వాత టవల్ ఎత్తును కొద్ది కొద్దిగా తగ్గిస్తూ రావాలి. అలా చివరి వరకు ఎత్తు తగ్గిస్తూనే టవల్‌పై నిద్రించాలి. ఈ క్రమంలో చివరికి నెమ్మదిగా దిండుని తీసేయొచ్చు. దీంతో ముందు చెప్పిన విధంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి.
దిండు ఉండడం వల్ల మెడతో పాటు వెన్నెముకకు మంచి సపోర్ట్ ఉంటుంది. అదే క్రమంలో దిండు కొంచెం ఎత్తు పెరిగినా అప్పుడు రెండింటిపై ఒత్తిడి పడుతుంది. దీని కారణం గానే మెడ నొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. అలానే ఆ ప్రభావం చర్మంపై కూడా పడుతుందట. అందుకే ఒకేసారి కాకుండా దశల వారీగా ఆ అలవాటును మానుకోవచ్చు. ఇలా చేయడం వల్ల అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి. వెన్నెముక, మెడకు కూడా బలం కలుగుతుంది. అలానే ఎప్పుడూ యవ్వనంతో కనిపిస్తారట. అంతేకాదు, దిండు లేకుండా నిద్రిస్తే చక్కని నిద్ర పడుతుందట. కాబట్టి దిండు పెట్టుకునే నిద్ర పోయే వారు ఈ అలవాటుని మానుకుంటే మంచిది. కానీ సడన్ గా మాత్రం కాదు. పై చెప్పిన విధంగా అనుసరిస్తే చాలు. అనేక సమస్యలకి చెక్ పెట్టేయచ్చు.