కరోనా : భారీగా బాల్య వివాహాలు.. ఎందుకో తెలుసా..?
ఆడపిల్లను భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు ఇలా బాల్య వివాహాలు సైతం చేసేందుకు సిద్ధమవుతున్నారట. సేవ్ ద చిల్డ్రన్స్ అనేటువంటి సంస్థ వేసిన అంచనా ప్రకారం... కరోనా కారణంగా 2025 నాటికి ఏకంగా 25 లక్షల మంది చిన్నారులు బాల్యవివాహాలు బారిన పడే ప్రమాదం ఉంది అంటూ తెలిపింది. ఇందులో భారత్ తో పాటు దక్షిణ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలోనే ఎక్కువగా ఈ బాల్య వివాహాలు ముప్పు ఉంది అని అంచనావేసింది సేవ్ ద చిల్డ్రన్ సంస్థ.
ఇక ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఎన్నో కుటుంబాలు ఆడపిల్లలను భారంగా భావిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో బాల్యవివాహాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఇక ప్రతి ఏటా 1.2 కోట్ల మంది బాలికలు బాల్య వివాహాలకు బలవుతున్నట్లు గత లెక్కలు కూడా చెబుతున్నాయని ఈ సంస్థ తెలిపింది. ఇక ఎలాంటి చర్యలు తీసుకోకపోతే 2025 నాటికి 6.1 కోట్ల బాలికలు బాల్య వివాహాలకు బలి అయ్యే అవకాశం ఉందని... ఇక 2020 సంవత్సరంలో ఏకంగా 5 లక్షల మంది బాలికలకు బలవంతంగా బాల్యవివాహాలు చేస్తున్నట్లు అంచనా వేశారు.