హత్రాస్ ఘటన : అదంతా కుట్ర.. యోగి సంచలన వ్యాఖ్యలు..?
ఇలా రోజురోజుకు హత్రాస్ ఘటన పై జరుగుతున్న నిరసనలు ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. "> మమతా బెనర్జీ లాంటి వాళ్లు సైతం రోడ్డెక్కి నిరసన తెలుపుతుండడంతో ఆందోళనలు మరింత పెరిగి పోతున్నాయి. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అయితే యోగి సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. దళిత యువతి కావడం వల్లే ప్రభుత్వం ఇప్పటివరకు నిందితులపై సరైన చర్యలు తీసుకోలేదని... దళితుల పట్ల బిజెపి దారుణంగా వ్యవహరిస్తుంది అంటూ ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
అయితే హత్రాస్ ఘటనలో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎంతోమంది విపక్ష నేతలు వెళ్తున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హత్రాస్ ఘటన పరామర్శకులపై విమర్శలు చేశారు. అభివృద్ధిని ఇష్టపడని వారే జాతి మత అల్లర్లను ప్రేరేపించాలి అనుకుంటున్నారు. అల్లర్ల ముసుగులో రాజకీయం చేసి కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు.. ఈ కుట్రలపై ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉంది అభివృద్ధి ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విమర్శలు చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.