బాబు ఐడియా వర్కవుట్ అయ్యిందా ? హ్యాపీనా కాదా ?

ఏదో ఒక రకంగా పార్టీలో ఊపు తీసుకురావాలనే ఉద్దేశంతో, టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఉండడమే కాదు, పార్టీని పరుగులు పెట్టించేందుకే ఆయన అన్ని రకాలుగానూ వ్యవహారాలను చక్కబెట్టుకుంటూ వస్తున్నారు. పార్టీ నేతల్లో నిరుత్సాహం పెరిగిపోవడం, ఇక భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కోలుకుంటోందనే నమ్మకం లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలతో ఇప్పటి వరకు ఇబ్బందులు పడినా, కొత్తగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా  ఇంచార్జీలను నియమించడంతో, పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని, కొత్తగా ఎంపికైన నాయకులు పార్టీని జనాల్లోకి తీసుకువెళ్లి, ప్రభుత్వంపై పోరాటం చేస్తూ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకు వస్తారని బాబు నమ్ముతున్నారు. బాబు నమ్ముతున్నట్లు గానే పార్టీ నేతలు ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్గొన్నా, అధికార పార్టీ వేధింపులు ఉంటాయేమోనని, కేసులతో తమను ఇబ్బంది పడతారేమో అనే భయంతో ఎవరికి వారు సైలెంట్ గానే ఉంటున్నారు.

పార్టీ పదవులు పొందిన మొదటి రెండు రోజుల్లో నేతలు కాస్త హడావుడి చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కానీ ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ గా కనిపిస్తున్నారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం హైదరాబాద్ లోని తన నివాసానికే పరిమితమైపోవడంతో, మిగతా నాయకులూ సైలెంట్ ఐపోయినట్టుగా కనిపిస్తున్నారు. తాము యాక్టివ్ గా ఉండే కంటే, ఈ పరిస్థితుల్లో సైలెంట్ గా ఉండటమే బెటర్ అనే అభిప్రాయానికి చాలామంది నాయకులు వచ్చేసారు. ఇక ప్రభుత్వంపై పోరాటాలు చేసే విషయంలోనూ ఇదే వైఖరిని కనబరుస్తున్నారు. చంద్రబాబు మాత్రం క్షణం తీరిక లేకుండా, ఇంటి నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, నాయకులతో జూమ్ సమావేశాలు నిర్వహిస్తూ, హడావుడి చేస్తున్నా, నాయకుల్లో మాత్రం ఎక్కడా చురుకుదనం కనిపించడం లేదు.

 అన్ని జిల్లాలకు కలిపి తాజాగా 51 మంది నాయకులకు బాబు పదవులు కట్టబెట్టారు. ఈ పదవుల్లోనూ బీసీ సామాజికవర్గానికి చెందిన వారికి ఎక్కువగా పదవులు కేటాయించారు. 2019 ఎన్నికల్లో బీసీలు టిడిపికి దూరమయ్యారనే కారణంతో ఈ ఎత్తుగడ వేశారు. కానీ, నాయకుల్లో మాత్రం ఉత్సాహం కనిపించడం లేదు తాను వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందని హ్యాపీగా హైదరాబాద్ నుంచే పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న బాబుకు పార్టీ నేతల వైఖరి మింగుడు పడడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: