సెల్ ఫోన్ల చోరీ కేసును చేదించిన పోలీసులు..
స్పీడ్ గా వెళ్తున్న లారీ నుంచి ఫోన్లను ఎలా కొట్టేశారు అనే అంశం పోలీసులను ఆలోచనలో పడేసింది. ఈ మేరకు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు బాగా కష్టపడ్డారు. మొత్తానికి సెల్ ఫోన్ కంటైనర్ చోరిని చేసిన ముఠాను పోలీసులు చాకచక్యంతో పట్టుకున్నారు. వారిని మహారాష్ట్రకు చెందిన కంజర భట్ ముఠా పనిగా పోలీసులు గుర్తించారు. ఇలాంటి వాటిని దొంగిలించడం లో వీరు పేరు మోసిన ముఠా అని పోలీసులు తెలిపారు. ఈ సందర్బంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన గుంటూరు జిల్లా ఎస్పి అమ్మిరెడ్డి మాట్లాడుతూ.. నిందితుల నుంచి 862 సెల్‌ఫోన్లు, రూ.4.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అంతే కాకుండా గతంలో వీరు చేసిన దొంగతనాలకు చిట్టాను కూడా బయట పడుతున్నాయని అన్నారు.ఇక మెదక్ జిల్లా చేగుంటలో మరో చోరీకి సంబంధించిన ప్లాన్ ను కూడా నిందితుల నుంచి తీసుకున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు.. 2.36 కోట్ల విలువైన 1,826 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ దొంగతనాలకు వాడిన కారును , లారీని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. చోరీలో 11 మంది ముఠా సభ్యులు పాల్గొన్నారని, ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని అన్నారు. మిగిలిన తొమ్మిది మందిని త్వరలోనే పట్టుకుంటామని అమ్మిరెడ్డీ అన్నారు. నిందితులను సోమవారం రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.