ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏక్షణంలో ఏంజరుగుతుందో తెలియకుండా ఉంది . ఇప్పుడు సరికొత్తగా ఏపీ టిడిపి నేత సబ్బం హరి స్థలాన్ని ప్రభుత్వం కూల్చివేసిందనే విషయంపై రాష్ట్రంలో రాజకీయంగా వాడి వేడిగా చర్చలు జరుగుతున్నాయి. అయితే కొంతమంది దీనిని సమర్థిస్తుండగా మరికొంతమంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన సబ్బం హరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రవ్యాఖ్యలు చేసారు. సబ్బం హరి తన నివాసంలో మాట్లాడుతూ ‘నేనేంటో విజయసాయికి తెలియదు. 24 గంటల్లో మ్యాటర్ క్లోజ్ చేస్తా’ అన్నారు. తానేంటో ముఖ్యమంత్రి జగన్ కు తెలుసనీ, విజయసాయికి తన గురించి తెలియదనుకుంటానని హరి చెప్పుకొచ్చారు. విశాఖలో కూర్చొని ఏదో చేద్దామనుకుంటే సాధ్యమయ్యే విషయం కాదని.. విశాఖలో డ్యాన్స్ చేద్దామని అనుకుంటున్నారని… ఆయన డ్యాన్స్ ని కట్టిస్తానని సబ్బం అన్నారు. తన గురించి తెలియక ఏదో చేద్దామనుకుంటున్నారని. ఈ తప్పు ఎందుకు చేశానా? అని బాధ పడే స్థాయికి తీసుకెళ్తానని సవాల్ విసిరారు సబ్బం హరి.
ఈ టీడీపీనేత సబ్బంహరి వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ మనమంతా రాజకీయనాయకులుగా ఉన్నాము, కాబట్టి సమాజంలో గౌరవంగా మరియు పద్దతిగా మెలగాలని .. అదే సమయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు సబ్బం హరి పచ్చాత్తాపం చెందాలని మంత్రి బొత్స అన్నారు. ప్రభుత్వం కూల్చివేసింది అక్రమనిర్మాణమే అని, మరి దీనిపై అంతగా బాధపడవలసిన అవసరం ఏముందని సబ్బం హరిని ఉద్దేశించి చెప్పారు. చట్టం ముందు అందరూ సమానులే అని...చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ విషయం లీగల్ గా ప్రొసీడ్ అయ్యేంత పెద్ద విషయం కాదని, మరి దీనికి సబ్బం హరి 24 గంటలలో మ్యాటర్ క్లోజ్ చేస్తానని అనడం సరికాదని బొత్స సత్యనారాయణ ఘాటుగా బదులిచ్చారు. అయితే దీనిపై ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో వేచిచూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: