పాకిస్తాన్ కి దారుణ పరాభవం.. తోక ముడుచుకోవాల్సి వచ్చింది..?

praveen
పాకిస్తాన్ ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలలో  విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులను పెంచి పోషించి చివరికి ఇతర దేశాల పైనకి ఉసిగొల్పుతూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు వివిధ దేశాలతో పాకిస్తాన్ ఉగ్రవాదం అనే అస్త్రంతో సృష్టించిన మారణహోమాలు ఇన్ని కావు అన్న విషయం తెల్సింది. అయితే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి ముందు వివిధ దేశాలు పాకిస్థాన్ నూ  ఉగ్రవాద దేశంగా నిరూపించి దోషిగా నిలబెట్టేందుకు ఎన్నో సార్లు ప్రయత్నాలు చేశాయి. కానీ చైనా మలేషియా లాంటి దేశాలు... పాకిస్తాన్ కు మద్దతుగా నిలవడంతో అది కాస్తా కుదరలేదు.




 కానీ ఇటీవలే ఏకంగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం  సమావేశంలో పాకిస్థాన్కు దారుణ పరాభవం ఎదురైంది అనే చెప్పాలి. ఒక అనలిస్ట్ అడిగిన ప్రశ్నకు పాకిస్థాన్ నోరు మెదప లేక తడబడి పోయింది. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియక... పాకిస్తాన్ నోరు మూసుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది  చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవలే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం సమావేశం జరిగింది. ఇక ఈ సమావేశంలో మానవ హక్కుల ఉద్యమకారిణి పాకిస్తాన్ ను  నిలదీసి అడిగిన ప్రశ్నకి అసలు పాకిస్తాన్ దగ్గర జవాబు అనేది లేకుండా పోయింది. దీంతో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి సమావేశంలో నోరు మెదప లేకపోయారు.




 ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగంలో సౌత్ ఏషియన్ స్టడీస్ ఎనలిస్ట్ రీసెర్చర్ వెరోనిక ఎక్ లాండ్..   పాకిస్తాన్ విదేశాంగ మంత్రిని  ఒక ప్రశ్న అడిగింది. అసలు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘంలో ఉగ్ర దేశమైన పాకిస్థాన్ కు అసలు సభ్యత్వం ఎలా వచ్చింది అంటూ ప్రశ్నించింది. ఐక్యరాజ్యసమితిలో ప్రముఖ ఉగ్రవాదిగా గుర్తించబడిన మసూద్ అజార్ పాకిస్తాన్ లో పబ్లిక్ గా తిరుగుతున్నారని.. ఓపెన్ గానే  స్టేట్మెంట్లు ఇస్తున్నాడని.. తెలిపిన సదరు అనలిస్ట్.. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఖురేషి.. జైషే  మహమ్మద్ ఉగ్రవాదులతో పాకిస్థాన్ కు  కాంట్రాక్టులు ఉన్నాయని ఒకానొక సమయంలో ఒప్పుకున్నాడు. ఇలాంటి దేశానికి అసలు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘంలో ఎలా సభ్యత్వం ఉంది అంటూ ప్రశ్నించడంతో.. పాకిస్తాన్  విదేశాంగ మంత్రి నోరు మెదప లేకపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: