గొంతుకోసుకున్న కరోనా రోగి.. చివరి కాల్ ఎవరికి చేశాడో తెలుసా..?
ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన జరిగింది. మహారాష్ట్ర లోని సాంగ్లీ జిల్లా లో కరోనా వైరస్ బారిన పడిన 56 ఏళ్ల వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చివరిగా కుమారుడి కి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. ఇక బాధితుడు కరోనా హాస్పిటల్ లో బెడ్ పై కూర్చొని గొంతు కోసుకున్న ఘటనలు సిసిటివి కెమెరా లో కూడా రికార్డు అయ్యాయి. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం గా మారిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆసుపత్రికి చేరుకునే సరికి అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
అయితే భయానక రీతిలో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంటున్న తరుణంలో... అలికిడి విని అప్రమత్తమయ్యారు హాస్పిటల్ సిబ్బంది. దీంతో అతను మరింత దారుణంగా గొంతు కోయ్యసాగాడు. హాస్పిటల్ సిబ్బంది వచ్చి అతన్ని వారించి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్ళినప్పటికీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... మృతుడి దగ్గర ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని అంటూ తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది.