హిజ్రాలను వేధించిన ట్రాఫిక్ పోలీస్ అధికారి అరెస్ట్!

Suma Kallamadi
ట్రాన్స్ జెండర్ కార్యకర్తను వేధించడంతో పాటు మరో ఇద్దరు హిజ్రాలతో అసభ్యంగా ప్రవర్తించిన ఒక కోల్కతా ట్రాఫిక్ పోలీస్ అధికారి పై కొరడా ఝుళిపించారు ఉన్నత అధికారులు. మంగళవారం రోజు ఈ కీచక ట్రాఫిక్ పోలీస్ ని ఉన్నత పోలీసు అధికారులు అరెస్టు చేశారు. తమని ఓ ట్రాఫిక్ పోలీస్ బాగా వేధిస్తున్నారని ఉన్నత పోలీస్ అధికారులని ఆశ్రయించారు. ఐతే ఆ ముగ్గురి హిజ్రాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ట్రాఫిక్ పోలీస్ అధికారిని కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడిని అభిషేక్ భట్టాచార్జీగా పోలీసులు గుర్తించారు.  పశ్చిమ బెంగాల్ ట్రాన్స్‌జెండర్ డెవలప్‌మెంట్ బోర్డు, మిగతా ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.

ట్రాన్స్ జెండర్ కార్యకర్త రంజిత సిన్హా ఇతర ఇద్దరు హిజ్రాల తో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో వారిని ఆపి అసభ్యంగా ప్రవర్తించాడు అభిషేక్ భట్టాచార్జీ. మమ్మల్ని దయచేసి వెళ్లనివ్వండి, సార్ అని ఎంత ప్రాధేయపడినా అతను మాత్రం వినిపించుకోకుండా వారిని తీవ్రంగా వేధించాడు. దాంతో చేసేదేమీ లేక ట్రాన్స్ జెండర్ కార్యకర్త 100 కి ఫోన్ చేసి తమని కాపాడవలసిందిగా కోరారు. వెంటనే స్పందించిన ఆమె కోల్కతా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అభిషేక్ భట్టాచార్జీ ని అదుపులోకి తీసుకొని పలు కేసుల నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెక్షన్ 341, 344, 509 సెక్షన్ల కింద అరెస్ట్ చేశామని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

ట్రాన్స్ జెండర్ కార్యకర్త రంజిత సిన్హా మీడియాతో మాట్లాడుతూ... 'ఒక పోలీసు అధికారి అయి ఉండి మాలాంటి ట్రాన్స్ జెండర్లను కూడా వదలడం లేదు. ఇక ఇటువంటి నుంచి లో అమ్మాయిలు కనిపిస్తే వదులుతారా? ఇటువంటి మగాళ్లను విధుల నుంచి తొలగించి కఠినమైన చర్యలు తీసుకోవాలి,' అని ఆమె డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: