పశ్చిమ గోదావరి లో దారుణం.. వ్యాపారిని కత్తులతో పొడిచి..చివరికి

Satvika
ఆంధ్ర ప్రదేశ్ లో రోజు రోజుకు క్రైమ్ రేటు బాగా పెరుగుతుంది.ఒక వైపు కరోనా కేసులు పెరుగుతుంటే, మరోవైపు కూనీలు,రాజకీయ నేతల ఘర్షణలు జరుగుతున్నాయి.పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ క్రైమ్ రేటు ఆందోళనకరంగా మారింది.రైస్ మిల్లు వ్యాపారవేత్తపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. . ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో కలకలం రేపుతుంది. కత్తి పోట్లు ఎక్కువగా పొడవడం తో పరిస్థితి విషమంగా ఉంది.


వివరాల్లోకి వెళితే..పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ఈ ఘటన వెలుగు చూసింది..28 కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు, వ్యాపార వేత్త సత్తి వేణుమాధవ్ రెడ్డిపై అతని ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు.సమిశ్రగూడెంలో ఈ దాడి జరిగింది. లక్ష్మీ నరసింహ రా రైస్ మిల్ వ్యవహారంలో గత కొంతకాలంగా వివాదం జరుగుతుంది. ఈ విషయం పై వారికి చాలా సార్లు గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద మనుషులతో పంచాయితీలు కూడా జరిగాయి. కానీ వారిలో వారు కొట్టుకోవడం ఆపలేదు. మరోసారి మాట మాట పెరిగి గొడవకు దారితీసింది.



ఈ నేపథ్యంలో వేణు మాధవ్ రెడ్డి పై ప్రత్యర్థులు కత్తులతో దాడికి దిగారు.ప్రత్యర్థులు చవ్వ సత్య కృష్ణ, శ్రీధర్ కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేయించినట్లు  మాధవ్ రెడ్డి తరపు వాళ్ళు అనుమానిస్తున్నారు. అతనిపై కత్తులతో దాడి చేసిన వారే కొన ఊపిరితో ఉన్న మాధవ రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం స్థానిక శేషగిరి ఆసుపత్రిలో మాధవ రెడ్డి చికిత్స పొందుతున్నారు. కత్తి పొట్లు బాగా ఎక్కువగా తగలడంతో, తీవ్ర రక్త స్రావం అయింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఈ దాడి గురించిన వివరాలను సేకరిస్తున్నారు.నిందితులుగా భావిస్తున్న చవ్వ శ్రీధర్‌ని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.సత్య కృష్ణ అతని కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: