ఎక్కువ వడ్డీ కావాలా.. ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే.. లాభాలే లాభాలు..?
నిపుణులు కూడా అధిక వడ్డీ రేటు అందించే బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయాలని అలా అయితే... ప్రయోజనం చేకూరుతుంది అని సూచిస్తుంటారు . ప్రస్తుతం చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు.. సేవింగ్స్ అకౌంట్ లపై తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. అదే ప్రైవేటు రంగ బ్యాంకులు మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే వడ్డీరేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇంతకీ అసలు మార్కెట్ లో ఏ బ్యాంకులు కస్టమర్లకు అధిక వడ్డీ రేట్లు అందిస్తున్నాయి అనే విషయం ఇప్పుడు తెలుసు రండి.
ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లు సేవింగ్స్ ఖాతాలో పై 3.6% లేదా 3.5 శాతం చొప్పున తమ కస్టమర్లకు వడ్డీరేట్లు అందిస్తున్నాయి. అందుకే ఈ బ్యాంకులో ఎక్కువగా కస్టమర్లు డిపాజిట్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 3.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు లలో 3 శాతం వడ్డీ లభించనుంది. ఇక ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా తమ కస్టమర్లకు 3.1 శాతం వడ్డీని అందిస్తుండడం గమనార్హం.
ఇక ప్రైవేటు రంగ బ్యాంకుల విషయానికొస్తే హెచ్డిఎఫ్సి తమ కస్టమర్లకు 3 శాతం వడ్డీ అందిస్తుండగా... మరో దిగ్గజ ప్రైవేటు రంగ బ్యాంకు ఐ సి ఐ సి ఐ 3.5 శాతం వడ్డీని అందిస్తోంది. కాగా ఎస్బిఐ మాత్రం తమ ఖాతాదారులకు 2.7 శాతం వడ్డీ అందించడం గమనార్హం.