బ్యాలెన్స్ తప్పుతున్న వైసీపీ ,? వారి రాకతో గందరగోళం ?

కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనా, పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో జగన్ అనుకున్న మేర బాగానే సక్సెస్ అయ్యారు. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడంలో నూ జగన్ సక్సెస్ అవుతూనే వస్తున్నారు. ఒకవైపు పార్టీని మరోవైపు ప్రభుత్వాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ జెండా రెపరెపలాడించాలి అనే విధంగా జగన్ ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్ పరిపాలనపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుండడం తో పాటు, ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తూ వస్తుండడంతో, జగన్ కు క్రేజ్ మరింత పెరిగింది. 


అసలే అధికార పార్టీ కావడం, తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీన అవ్వడం, ఇలా అనేక కారణాలతో తెలుగుదేశం పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులు వలసలు జరుగుతూనే వస్తున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నాయకులు ఇలా టిడిపిలో ఒక వెలుగు వెలిగిన వారంతా వైసీపీలోకి వచ్చి చేరడమే కాకుండా,  ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు వైసీపీ జెండా కప్పుకోక పోయినా, ఆ పార్టీకి  అనుబంధంగా ఉంటున్నారు. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సైతం జగన్ కి జై కొట్టారు. తాజాగా విశాఖ ఎమ్మెల్యే నేరుగా వైసిపి జెండా కప్పుకున్నారు. వీరే కాకుండా మరికొంతమంది ఎమ్మెల్యేలు వైసిపి బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా వైసీపీలో చేరికల జోష్ లో ఉండగా, పార్టీ నాయకుల్లో మాత్రం ఉత్సాహం కనిపించడం లేదు. ఇప్పటికే పార్టీలో నాయకుల సంఖ్య ఎక్కువైందని , నియోజకవర్గాల్లో పరిస్థితి అదుపు తప్పిందని, గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయని, పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉన్న నాయకులకు కీలక పదవులు దక్కడం లేదనే అసంతృప్తి ఉన్నారు.



 నామినేటెడ్ పదవుల్లోనూ, కొత్తగా వచ్చి చేరిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని, ఇలా ఎన్నో అసంతృప్తులు పార్టీ నేతల్లో పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో మరికొంతమంది నాయకులను చేర్చుకోవడం ద్వారా, వైసిపి బలోపేతం కావడం పక్కనపెట్టి, పాత నాయకులు వర్సెస్ కొత్త నాయకులు అన్నట్లుగా పరిస్థితి ఉంటుందని, ఒకరికి ఒకరు సహకరించుకునే పరిస్థితి ఉండదని, అంతిమంగా పార్టీకి తీరని నష్టం జరుగుతుందనే అభిప్రాయం లో పార్టీ అభిమానులు ఉన్నారు. జగన్ మాత్రం టిడిపిని దెబ్బకట్టేందుకు చేరికలు ప్రోత్సహించడం ఒకటే మార్గం గా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: