ఈ మధ్య కాలంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి మంచి డిమాండ్ ఉంది.ఉరుకులు పరుగులు జీవితంలో అన్నీ ఉన్న చోటుకే రావడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. డబ్బులు పెట్టాలి అని ఈరోజుల్లో ఎవరు అనుకోవడం లేదు..రుచికరమైన ఆహారం ఉంటే చాలు అని ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ లపై ఆధారపడుతున్నారు.బెస్ట్ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అంటే స్విగ్గి, జోమాటో .. ఎందరి ఈ యాప్ ల వల్ల ఉపాధిని పొందుతున్నారు. అలాంటిది ఇప్పుడు స్విగ్గి బాయ్స్ పెద్ద ఎత్తున నిరసన చేపడుతున్నారు. ఎక్కడ డెలివరి లు లేక చాలా మంది సెల్ఫ్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి.
అందుకు కారణం డెలివరీ బాయ్స్ ఇవ్వవలసిన కనీస కమీషన్ కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే..
మాదాపూర్ కాకతీయ హిల్స్ గ్రౌండ్‌లో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గికి చెందిన డెలివరీ బాయ్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోకాళ్ళ పై నిలబడి బాధలను చెప్తూ నిరసన తెలుపుతున్నారు. అలోవెన్స్, జీతాలు, కమీషన్ ను ముందు పద్దతులలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
స్విగ్గీ కంపెనీలో నగర వ్యాప్తంగా డెలివరీ ఎగ్జిక్యూటివ్ పార్టనర్స్‌తో కలిపి వేల మంది పని చేస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు నాలుగు కిలోమీటర్ల మేరకు డెలివరీ చేస్తే 35 రూపాయలు కమీషన్ గిట్టేది. కానీ ఇప్పుడు ఆరు రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.అప్పుడు జీతం కూడా 15 నుంచి 20 వేల వరకు వచ్చేదని, ఇప్పుడు కమీషన్ తో కలిపి 10 వేలు కూడా గిట్టడం లేదని అన్నారు. తమను మోసం చేస్తున్న కంపెనీపై కార్మిక చట్టం ప్రకారం, చర్యలు తీసుకోవాలని ఐటీ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌కు వినతి పత్రం అందజేశారు. అందులో ఎప్పటిలాగే ఆర్డర్ పై 35 రూపాయలు చెల్లించాలని,ఒక కిలోమీటర్ ఆర్డర్ కు మినిమం 10 రూపాయలు చెల్లించాలని కోరుతున్నారు. మరి ఈ విషయం పై ఆ కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి .