అల్లున్ని చెట్టుకు కట్టేసి కొట్టిన అత్త.. పక్కనే ఉండి సపోర్ట్ చేసిన భార్య.. కారణం..?
ఇక వివాహం జరిగిన ఐదేళ్ల పాటు వీరి కాపురం ఎంతో సజావుగా సాగింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో గత కొంత కాలం నుంచి అత్తింటి వారితో దేవేందర్ కి అస్సలు పడటంలేదు. ఏదో ఒక విషయంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల ఈ నెల 9వ తేదీన కూడా అత్తవారింటి కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో ఏకంగా అల్లుడు అని కూడా చూడకుండా దేవేందర్ పై దాడికి దిగారు అత్తింటి కుటుంబ సభ్యులు.
భార్య కూడా పుట్టింటి వారికి సహకరించింది. అందరూ కలిసి దేవేందర్ ను చెట్టుకు కట్టేసి బూతులు తిడుతూ దారుణంగా కొట్టారు. దీంతో దేవేందర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. అయినప్పటికీ పిల్లల కోసం జీవించాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలనే పిల్లలను చూసేందుకు అత్తవారింటికి వెళ్ళాడు. మళ్లీ అక్కడ అవమానమే. అంత అవమానించాకా మళ్లీ ఏ ముఖం పెట్టుకొని వచ్చావ్... పిల్లలను చూపించే ప్రసక్తే లేదు అంటూ చీదరింపులతో తలుపులు మూసేశారు అత్తింటివారు. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు దేవేందర్. గమనించిన స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయగా హుటాహుటిన అక్కడకు చేరుకుని అంబులెన్స్ అతన్ని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు వదిలాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.