జగన్ సర్కారుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురు..

Satvika
జగన్ మోహన్ రెడ్డికి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కరోనా వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక నష్టాల్లోకి కూరుకుపోవడం, హిందూ దేవాలయాల పై దాడులు జరగడంతో ప్రతి పక్షాల ఒత్తిడితో సీబీఐ విచారణకు జగన్ సర్కారు పిలుపునిచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ సర్కారు కు తల భారం పెరుగుతుంది. మొన్నటి దాకా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి అని కోర్టులో వేసిన నివేదికపై చుక్కెదురైంది. ఈ విషయం పై పలువురు తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు మరోసారి హైకోర్టు ఇచ్చిన తీర్పుకు జగన్కు భారీ షాక్ తగిలింది.



మూడు రాజధానులు, సీఆర్డీఏ వ్యవహారంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే అన్నీ అంశాలను పరిశీలించిన కోర్టు వాయిదా ను అక్టోబర్ 5 కు పొడిగించారు. రాజధాని పై స్టేటస్ ను కూడా అక్టోబర్ 5 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. విచారణ వాయిదా పడటానికి కారణం సాంకేతిక పరమైన అంశాలు, సరైన నివేదిక లేకపోవడం కారణమని తెలుస్తుంది. రాజధాని బిల్లులలు అమలు చేయకుండా స్టేటస్కో కొనసాగుతందని ధర్మాసనం పేర్కొంది. ఆగస్టులో రాజధానుల పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు కౌంటర్ ను దాఖలు చేసి సెప్టెంబర్ 11 వరకు సమయం ఇచ్చింది.



మూడు రాజధానుల అమలు పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. ఈ మేరకు ఏపి హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను తప్పుపడుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మశాసనం తోసి పుచ్చింది. ఒకవైపు హైకోర్టులు మూడు రాజధానుల విషయం పై విచారణ జరుగుతున్న కూడా, విచారణ కోసం మా దగ్గరకు రావడం సబబు కాదని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు ఈ విచారణను త్వరలోనే పరిష్కరిస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సీఆర్డీఏ వ్యవహారం, మూడు రాజధానుల పై తుది నిర్ణయాన్ని అక్టోబర్ 5 న వెలువడనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: