చేయి నరుక్కున్న యువతి.. కారణం తెలిసి అవాక్కైనా పోలీసులు..?

frame చేయి నరుక్కున్న యువతి.. కారణం తెలిసి అవాక్కైనా పోలీసులు..?

praveen
మామూలుగా అమ్మాయిలు ఎంతో సుకుమారంగా..  సున్నిత మనస్తత్వం కలవారు అని చెబుతూ ఉంటారు... అయితే ఎక్కడ అమ్మాయిలను చూసినా ఇదే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన ఘటన చూస్తే మాత్రం అమ్మాయిలు ఈ రోజుల్లో మరి ఇంత వైలెంట్ గా మారిపోయారు ఏంటి అని అనిపించక మానదు. ఈ అమ్మాయి చేసిన పని చూస్తే ఏకంగా ఒళ్ళు జలదరిస్తుంది. ఇంతకీ ఆ యువతి ఏం చేసింది అని అనుకుంటున్నారా... ఏకంగా తన చేయిని తానే రికేసుకుంది . అది కూడా ఓ చిన్న కారణానికి. ఆ యువతి చేయి  నరుక్కోవడానికి గల కారణం తెలిసి స్థానికులు పోలీసులు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు.




 స్లోవేనియా కు చెందిన 22 ఏళ్ల జులిజా ఆడ్లేసిస్... చెయ్యి తెగిపోవడంతో ప్రమాదవశాత్తు ఘటన జరిగింది అని అనుకొని తండ్రి ప్రియుడు ఆమెను హాస్పిటల్లో చేర్చారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు... ఈ క్రమంలోనే అసలు విషయం తెలిసి ఒక్కసారిగా అవాక్కయ్యారు పోలీసులు. సదరు యువతి చేయి ప్రమాదవశాత్తు తెగిపడ లేదని స్వయంగా తన చేయి తానే యువతిని నరుక్కుంది  అన్న విషయం పోలీసుల విచారణలో తేలింది. అంతేకాదు దీని వెనుక ప్రియుడు కుట్ర కూడా ఉంది అన్న విషయం కూడా పోలీసులు గుర్తించారు.



 ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏడాది కిందట ప్రియుడు ఆ యువతికి ఇన్సూరెన్స్ సంస్థలో  భీమా చేయించాడు. అయితే సదరు యువతి ఏదైనా ప్రమాదం బారిన పడి వికలాంగురాలు అయితే... 8.83  కోట్ల రూపాయల బీమా వస్తుంది. దీంతో ఈ డబ్బు కోసం తీవ్రంగా ఆలోచించి ఏకంగా దారుణానికి ఒడిగట్టారు. అయితే ఈ విషయం కోర్టు వరకు వెళ్లగా.. తన చేయి  ప్రమాదవశాత్తు తెగిపడిందని..  ఎవరైనా... స్వయంగా చేతిని నరుక్కుంటారా  అంటూ వాదించింది యువతి. అయితే తర్వాత ప్రియుడు చేయు  ఎలా నరుక్కోవాలి అనే విధానం పై సోషల్ మీడియాలో వెతికిన విషయాన్ని గుర్తించారు పోలీసులు. ఇక వైద్యులు సదరు యువతికి శస్త్రచికిత్స చేసి తెగిపోయిన చేయండి మళ్ళీ అతికించ గలిగారు. ఇక వారికి మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: