పార్లమెంట్ సమావేశాలకు హాజరైన 17 మంది ఎంపీలకు కరోనా పాజిటివ్ ..?
పరీక్షలు చేయించుకున్న ఎంపీలలో 17 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. వారిలో ఇద్దరు వైకాపా ఎంపీ లు కూడా ఉన్నారు.వీరందరికీ ఎలాంటి లక్షణాలు బయటపడకుండానే కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం గమనార్హం. ఇక పాజిటివ్ వచ్చిన ఎంపీ లలో మీనాక్షీ లేఖీ, అనంత్ కుమార్ హెగ్డే, పర్వేశ్ సాహిబ్ సింగ్ తదితరులు ఉన్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో పార్లమెంట్ ప్రాంగణంలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేశారు. సామాజిక దూరం కూడా ఏర్పాటు చేశారు.
రాజ్యసభ భవనాన్ని కూడా లోక్ సభ సభ్యుల కోసం కేటాయించారు. లోక్ సభ, రాజ్య సభ సమావేశాలు ఒకేసారి కాకుండా ఉదయం ఒకటి, మధ్యాహ్నం తర్వాత మరొకటి నిర్వహించేలా షెడ్యూల్ చేశారు. అత్యవసర సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. అందరూ పరీక్షలు చేయించుకోవాలని వుంది. ఆదివారం కొంతమందికి, సోమవారం కొంతమందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.పాజిటివ్ వచ్చిన ఎంపీల్లో బీజేపీకి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. 12 మంది బీజేపీ ఎంపీలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇక మిగిలిన ఆర్‌ఎల్‌పీ, డీఎంకే, శివసేన పార్టీలకు సంబంధించి ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చింది. ఇక రాజ్య సభ సభ్యుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.