ఎన్నికల కోసం భార్యకు విడాకులు ఇచ్చాడు.. కానీ చివరికి..?
వివరాల్లోకి వెళితే.. మర్రిపల్లిగూడెం గ్రామానికి చెందిన ఎనకాల విజయ్ కుమార్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాడు.. అయితే రెండు పెళ్లిళ్లు కావడంతో నిబంధనల ప్రకారం అది కుదరదు కాబట్టి రెండో భార్య జోత్స్నా కు విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత మున్సిపల్ ఉద్యోగిగా పనిచేస్తున్న జ్యోత్స్నా వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది . కాగా వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. భార్య సంతోషాన్ని చూసి తట్టుకోలేకపోయాడు విజయ్ కుమార్. ఇక రెండో భార్య భర్త పై కిడ్నాప్ కేసు పెట్టి జైలుకు పంపించడం. అయినప్పటికీ అతని పగ మాత్రం తీరలేదు.
బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత.. ఎలాగైనా పగ తీర్చుకోవాలని భావించారు. దీంతో ఏకంగా ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నాడు తన అనుచరులతో... రెండో భార్య భర్త తిరుపతి పై హత్యాయత్నం చేయించాడు. దీంతో నలుగురు వ్యక్తులు తిరుపతి పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తిరుపతి అపస్మారక స్థితిలోకి చేరుకోగానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు నిందితులు. దీంతో వెంటనే గమనించిన తిరుపతి తమ్ముడు అతని ఆస్పత్రికి తీసుకెళ్ళాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.