అందరూ ఊపిరి పీల్చుకోండి.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్..?
ఈ వ్యాక్సిన్ కారణంగా జంతువుల లో ఎలాంటి దుష్ప్రభావం జరగలేదని... అంతేకాకుండా ఫలితాలు కూడా ఎంతో మెరుగ్గా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. రెండోసారి డోస్ ఇచ్చిన 14 రోజుల తర్వాత.. ముక్కు గొంతు ఊపిరితిత్తుల్లో వైరస్ ను సమర్ధవంతం గా నియంత్రించినట్లు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు. అయితే ఈ వ్యాక్సిన్ కోతులపై ఉపయోగించిన విషయాన్ని కూడా తెలిపింది భారత్ బయోటెక్.
కాగా ఇది భారత ప్రజలు అందరికీ ఒక శుభవార్త అనే చెప్పాలి. రోజురోజుకు దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న తరుణంలో ప్రస్తుతం వ్యాక్సిన్ వస్తేగానీ కరోనా వైరస్ ను నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం భారత్ బయోటెక్ ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెప్పడం ఇదొక శుభపరిణామం అని చెప్పాలి. ఇక భారత్ బయోటెక్ ప్రకటనతో ప్రజలందరిలో కొత్త ఆశలు చిగురించి కుంటున్నాయి.