చదివిందేమో 5 వ తరగతి.. కానీ పెద్ద డాక్టర్ అయ్యాడు..?

praveen
ప్రజలను మోసం చేసి భారీగా డబ్బులు దండుకునే  వారు రోజురోజుకు ఎక్కువవుతున్నారు  అన్న విషయం తెలిసిందే. చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ప్రజలను మాయ మాటల తో నమ్మిస్తూ భారీగా క్యాష్ చేసుకుంటున్నారు ఎంతోమంది మోసగాళ్లు. రోజురోజుకు ఇలాంటి మోసగాళ్ళను పోలీసులు పట్టుకుని కటకటాల వెనుకకు తోస్తున్నారు. ఇలాంటి ఓ మోసగాడు యావ్వారం బయటపడింది. చదివిందేమో ఐదో తరగతి... కానీ పెద్ద డాక్టర్ అయ్యాడు... ప్రముఖ ఆసుపత్రిలో పని చేశాడు... ఏకంగా పోలీస్ అధికారులకు సైతం ప్రత్యేక తరగతులు నిర్వహించాడు.




 కానీ ఎక్కడో తేడా కొట్టింది చివరికి కటకటాల పాలయ్యాడు. దీంతో ఐదో తరగతి తో పెద్ద డాక్టర్ అయిన నకిలీ వైద్యుడు గుట్టు రట్టయింది. నకిలీ వైద్యుడిగా చలామణి అవుతున్న తేజ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. అంతేకాదు అతడికి వైద్యుడిగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందేందుకు సహకరించిన మరో ఆరుగురి  కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇక  ఈ కేసు విచారణలో ఎన్నో సంచలన నిజాలు బయటపడ్డాయి. నగరంలోని ప్రముఖ ఆసుపత్రులలో.. డాక్టర్ గా చేరాడు తేజ. అంతకు ముందు  ఐపీఎస్ అధికారిగా కూడా అవతారమెత్తాడు.




ఇక వైద్యుడిగా  ఎన్నో వైద్య శిబిరాలు నిర్వహించారు... పోలీసు సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా  బారినపడిన పోలీస్ సిబ్బందికి వైద్యం అందించాడు. ఇలా ఎంతో మంది పోలీసులను నమ్మించి  డబ్బులు దండుకున్నాడు . రెండు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడు. అయితే ఓ రౌడీ షీటర్ కు చెందిన వాహనాన్ని ప్రభుత్వ వాహనం అంటూ స్టిక్కర్  వేసుకొని తిరగడంతో అనుమానం వచ్చిన పోలీసులు కూపీ లాగితే డొంక కదిలింది. వైయస్ తేజ పేరుతో ఎన్నో రోజుల నుంచి చేస్తున్న  నేరాలు తెలిసి పోలీసులు సైతం అవాక్కయ్యారు. దీంతో వెంటనే అతన్ని అరెస్టు చేసి కటకటాల వెనుకకు తోసారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: