కేంద్రం కీలక నిర్ణయం.. ఎలాంటి గ్యారెంటీ లేకుండా రుణం.. త్వరపడండి..?
అర్హులైన వారికి సులభంగా నే రుణాలు అందించేందుకు నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. దీని కోసం ఒక సరికొత్త స్కీం తీసుకువచ్చింది. పీఎం స్వనిది యోజన మొబైల్ యాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తుంది. అయితే ఈ యాప్ లో ఈ కేవైసీ, అప్లికేషన్ ప్రాసెసింగ్, రియల్ టైం మానిటరింగ్ లాంటి ఫీచర్లు అందుబాటు లో ఉంచింది. వీటి ద్వారా వ్యాపారులు సీఎం స్వనిది స్కీమ్ లో భాగంగా సులభం గా లోన్ పొందేందుకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం.
కాగా ఈ స్కీం ద్వారా రుణం తీసుకున్న లబ్ధిదారులు... లోన్ మొత్తాన్ని క్రమం తప్పకుండా సమయానికి చెల్లించడం కారణంగా మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ లోన్ తీసుకున్న తర్వాత వడ్డీ రేటులో 7 శాతం వరకు సబ్సిడీ కూడా పొందేందుకు అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎలాంటి గ్యారెంటీ లేకుండా అర్హులకు ఈ రుణం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడింది. ప్రస్తుతం కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త స్కీం కరోనా సంక్షోభం సమయంలో ఎంతో మందికి ఉపయోగపడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. https://pmsvanidhi.mohua.gov.in/ సైట్ ద్వారా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.