కొవిడ్-19 నెగిటివ్ రిపోర్ట్ ఇస్తానని ఓ మహిళను ఇంటికి పిలిచి రేప్ చేసిన జూనియర్ డాక్టర్!
కొన్ని రోజుల క్రితం ఆసుపత్రికి కరోనా వైరస్ నిర్ధారణ టెస్ట్ చేయించుకుందామని వెళ్ళినా మహిళతో మాటలు కలిపి... లక్షణాలు ఉన్నాయంటూ అబద్ధం చెప్పి ఫలితాలు వచ్చేంతవరకు ఆమెను హోమ్ క్వారంటైన్ లో ఉండమని హెల్త్ ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఆ తర్వాత ఫలితాలు వచ్చాయని... కోవిడ్ 19 నెగిటివ్ గా నిర్ధారణ అయ్యిందని... నెగిటివ్ రిపోర్ట్ ఇంటికి వస్తే ఇస్తానని చెప్పాడు. దాంతో ఆమె అతడి ఇంటికి వెళ్లగా... ఆమెను లాక్కెళ్ళి బలత్కారం చేశాడు.
ఈ విషయం కాస్త అందరికీ తెలియడంతో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కే కే శైలజ ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే నిందితుడైన హెల్త్ ఇన్స్పెక్టర్ ని వెంటనే విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. అయితే అత్యాచారానికి పాల్పడిన హెల్త్ ఇన్స్పెక్టర్ పేరు ప్రదీప్ అని పోలీసులు వెల్లడించారు. వైద్య రంగంలో ఇటువంటి నీచుల ఉండటం వలన అందరికీ చెడ్డపేరు వస్తుందని రాష్ట్ర ప్రతిపక్షం అధినేత రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రజలను కాపాడే చేయాల్సిన పోలీసులు, డాక్టర్లే సామాన్య ప్రజలపై అత్యాచారాలకు పాల్పడటం చాలా విషాదకరం.