ఢిల్లీ పిలుపు....మంత్రుల్లో గుబులు

sujatha
ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు బొత్స సత్యనారాయణకు పిలుపువచ్చిందంటే చాలు రాష్ట్రంలో నాయకత్వం మారుతుందేమోనని మంత్రుల్లో గుబులు మొదలవ్వగా, పార్టీలో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఇటివల జరిగిన శాసనసభ ఉప ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకోవటంలో వారిరువూరు ఘోరంగా వైఫల్యం చెందినట్లు రుజువైన రోజు నుంచి నాయకత్వం మార్పుపై ఊహగాసాలు జోరందుకున్నాయి. దాంతో ముఖ్యమంత్రి మార్పు అనివార్యం అని ఇటు పార్టీవర్గాలు అటు ప్రజల్లో బలంగా అనుమానాలు తలెత్తుతున్నాయి. మరీ ముఖ్యంగా వారిరువూరు ప్రదతీసారి ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రత్యేకంగా పార్టీ అధిష్టానవర్గం నుంచి పిలుపు వచ్చినపుడుల్లా ఈ చర్చ జరుగుతుంది. దీనితో ఆగకుండా రాష్ట్రపతి ఎన్నికల తర్వత నాయకత్వం మారుతుందని కొందరు, 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మరికొందరు గట్టిగా వాదిస్తున్నారు. పిసిసి అధ్యక్ష్యులు కూడా వచ్చే ఎన్నికల వరుకు కిరణ్ కుమార్ రెడ్డి ఉంటారని పలుమార్లు ప్రకటించారు. అయితే కాగ్రేస్ లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్యకర్త నుంచి నాయకుని దాకా చెప్పెదొకటి చేసేదొకటి అనే వాస్తవం కూడా అందరికీ తెలుసు. చెప్పింది చేయరు చేసేది చెప్పరు అనేది కాంగ్రెస్ చరిత్ర. ఆ పార్టి చరిత్ర ఎలా ఉన్న రాష్ట్రంలో మాత్రం పరిపాలన అనేది పూర్తిగా గాడి తప్పిపోయి అసలు ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారనది కూడా చరిత్రలో నమోదయ్యే అవకాసం కనబడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: