పసికందు ప్రాణం తీసిన వైద్యులు.. వింత కారణం చెప్పి..?
వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఓ మహిళ ప్రసవం కోసం చ్చింది . ఈ క్రమంలోనే నార్మల్ డెలివరీ కి సాధ్యపడదు అంటూ తెలిపిన వైద్యులు... సదరు మహిళకు పెద్దాపరేషన్ చేసి శిశువును బయటకు తీశారు. కానీ అందులోనే కుటుంబ సభ్యులకు విషాదకర వార్త తెలియజేశారు వైద్యులు. శిశువు చనిపోయిందని అంటూ తెలిపారు. కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మరణించి ఉండవచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్ కు చెందిన చెన్నూరు సంధ్య... పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలోని గురువారం సాయంత్రం సమయంలో పోలీసులు సదరు మహిళకు సిజేరియన్ చేసి బయటకు తీశారు. కానీ అప్పటికే శిశువు చనిపోయి ఉంది అంటూ వైద్యులు తెలిపారు. శిశువు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు. అయితే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఇదేంటి అంటూ వైద్యులను నిలదీసి ప్రశ్నించగా.. రెండు రోజుల క్రితమే కడుపులో శిశువు చనిపోయింది అంటూ సమాధానం చెప్పారు . కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తూ వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మరణించిందని ఆందోళనకు దిగారు. సదరు వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.