నిద్రపోనివ్వడం లేదని 13రోజుల చిన్నారిని చంపిన మేనమామ..!

Suma Kallamadi
ప్రస్తుతం సమాజంలో ప్రాణాలకు విలువలేకుండా పోయింది. రోజురోజుకు హత్యలు, ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి. అన్యం పుణ్యం తెలియని పసిపాప ప్రాణాన్ని బలి తీసుకున్నాడు ఓ దుర్మార్గుడు. ఆడపిల్లకు తండ్రి లేకున్నా మేనమామ ఉండాలని అంటున్నారు. కానీ అలాంటి మామనే చిన్నారి కోడలి ప్రాణాలను బలి తీసుకున్నాడు. 13 రోజుల పసికందును నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు ఓ కసాయి మేనమామ. 
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా బుద్రుక్‌ గ్రామానికి చెందిన కృష్ణ షిండేకి ఓ సోదరి ఉంది. ఆమెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అయితే ఇటీవల షిండే సోదరి డెలివరీ కోసమని తల్లిగారింటికి వచ్చింది. 15 రోజుల క్రితం ఆమెకు పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. అయితే ఆమెను ఆసుపత్రి నుండి డిశ్చార్జి చేసి ఇంటికి తీసుకొచ్చారు.
అయితే శిశువు తరచూ ఏడుస్తుండడంతో విసుగు చెందిన 19 ఏండ్ల మేనమామ కృష్ణ. సోమవారం ఉదయం చిన్నారిని నీటి డ్రమ్ములో వేసి పారిపోయాడు. డ్రమ్ములో పాపకు శ్వాస అందాకా మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకి సంబంధిచిన వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. ఇక నిందితుడు కృష్ణ షిండేను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేశారు. పాప తరచూ ఏడుస్తుండడంతో తన నిద్రకు భంగం కలిగిందని, అందుకే నీటిలో ముంచి చంపేశానని నేరం ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: