ప్రధాని మోడీ చేసిన విధ్వంసాలు ఇవే.. రాహుల్ గాంధీ అసలు నిజాలు..?

praveen
గత కొంత కాలం నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ పై ఎన్నో విమర్శలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ప్రతి విషయాన్ని తప్పుబడుతూ తీవ్రస్థాయిలో మోదీ సర్కార్ పై విరుచుకుపడుతూ  విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ. అంతే కాకుండా తరుచు  సోషల్ మీడియా వేదికగా మోడీ ప్రభుత్వం చేసిన అక్రమాలు... విధ్వంసాలు అంటూ కొన్ని విషయాలను కూడా ప్రస్తావిస్తూ సంచలనం సృష్టిస్తూనే ఉంటారు. కరోనా  వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం పై రాహుల్ గాంధీ విమర్శల పర్వం మరింత ఎక్కువగా అయింది అని చెప్పాలి.




 అదే సమయంలో అటు బీజేపీ నేతలు కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తిప్పి కొడుతూ ప్రతి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రోజురోజుకు కాంగ్రెస్ బీజేపి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు పర్వం రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. తాజాగా మరోసారి రాహుల్ గాంధీ  సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మోడీ సర్కార్ పై సంచలన విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విధ్వంసాలు అంటూ ఒక పోస్టు పెట్టిన రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు.



 మోడీ చేసిన విధ్వంసాలు అంటూ పోస్ట్ ప్రారంభించిన రాహుల్ గాంధీ ఈ పోస్టులో పలు కీలక విషయాలు గురించి ప్రస్తావించారు. భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ జి.డి.పి దారుణంగా మైనస్ (-23) స్థాయికి పడిపోయింది అంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. గత 45 ఏళ్లలో దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం ఏర్పడిందని... 12 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు అంటూ తెలిపారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల కు జిఎస్టి వాటాను కట్ చేయడం... ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో కరోనా  వైరస్ కేసులు మరణాలు నమోదు కావడం... భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఆక్రమణలు చోటుచేసుకోవడం.. ఇవన్నీ మోదీ విధ్వంసాలు అంటూ పేర్కొన్నారు రాహుల్ గాంధీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: