భర్త మృతితో బోరుమన్న భార్య.. కానీ ఆ తర్వాతే అసలు నిజం తెలిసింది..?
ఈ దారుణ ఘటన తూర్పు గోదావరి జిల్లా లో వెలుగు లోకి వచ్చింది. వివరాల్లో కి వెళితే.. జిల్లాలో ని కాట్రేనికోన మండలం చెయ్యేరు అగ్రహారాని కి చెందిన నరసింహ మూర్తి ఇటీవలె ఉన్నట్టుండి సడన్ గా మృతిచెందారు. అయితే కట్టుకున్న భార్య భర్త ను దారుణంగా హత్య చేసి తర్వాత హైడ్రామాకు తెర లేపింది. బంధువుల అందరి తో కలిసి తన భర్త దూరమయ్యాడు అంటూ బోరున విలపిస్తూ అందరిని నమ్మించింది . ఆ తర్వాత సంప్రదాయం ప్రకారమే నరసింహమూర్తి అంత్యక్రియలు జరిగిపోయాయి.
కానీ గ్రామస్తుల్లో ఉన్న అనుమానాలు మాత్రం వీడలేదు. నిన్న మొన్నటి వరకు మా ముందు ఆరోగ్యంగా తిరిగిన మనిషి ఉన్నపలంగా ఎలా మృతి చెందాడు అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ క్రమం లోనే మృతుడి భార్యపై అనుమాన పడి గట్టిగా నిలదీయడంతో భార్య అసలు నిజం బయటపెట్టింది .. తన భర్తను తానే స్వయంగా హత్య చేసినట్లుగా నేరం అంగీకరించింది . సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.