కామంతో ఊగిపోయిన వీఆర్ఏ.. బాలికపై కన్నేసాడు.. కానీ చివరికి..?
కామంతో కళ్లు మూసుకుపోయి తాము ఏం చేస్తున్నామో అన్న విషయాన్ని కూడా మరిచి చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి కామాంధుల బారినపడి అభం శుభం తెలియని చిన్నారులు సైతం చింద్రం అయిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శుభం తెలియని చిన్నారిపై వీఆర్ఏ అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రజలకు సహాయం చేయాల్సిన వీఆర్ఏ నీచ బుద్ది చూపి చివరికి బాలిక పై అత్యాచారం చేశాడు. కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన... నాగమయ్య అనే 45 ఏళ్ల వ్యక్తి వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు.
సదరు వ్యక్తి సమీపంలో ఉన్న 9 ఏళ్ల బాలిక పై కన్నేశాడు. రాత్రి సమయంలో కామంతో ఊగిపోయిన సదరు వ్యక్తి ఇంటి ముందు బాలికకు మాయమాటలు చెప్పి.. సమీపంలో ఉన్న ఆలయ వెనుక ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ బాలికపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక అరుపులు విని స్థానికులు అక్కడికి వచ్చి చూడగా ఘోరాన్ని చూసి షాక్ అయ్యారు. దీంతో అతనికి దేహశుద్ధి చేసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగమునయ్య పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.