తల్లి చేసిన పనికి మూడేళ్ల కూతురు బలైంది.. చివరికి..?
వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కేంద్రానికి చెందిన రాయ్ శెట్టి రమ్యకు శ్రీనివాస్ అనే వ్యక్తి తో పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు ఒక కూతురు ఉన్నారు. అయితే ఇటీవలే రమ్య తన మూడేళ్ల కూతురు తో కలిసి బావిలో దూకి మృతి చెందింది. గత కొంతకాలం నుంచి సమీప బంధువుల మీ సేవ కేంద్రం లో పనిచేస్తుంది రమ్య. ఇటీవలే మీ సేవ కేంద్రం నుంచి ఆసుపత్రికి వెళ్తున్నట్లు చెప్పిన రమ్య అనూహ్యంగా తర్వాత బావిలో మృతదేహమై తేలింది. రమ్య భర్త ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. కొంతకాలం నుంచి కుటుంబకలహాలు ఎక్కువైపోయాయని.. అందుకే మనస్తాపం చెంది రమ్య మృతి చెంది ఉంటుంది అని బంధువులు భావిస్తున్నారు.
అయితే రమ్య పుట్టినిల్లు మెట్టినిల్లు వీణవంక గ్రామమే కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రమ్య మృతితో గ్రామస్తులు అందరూ విషాదంలో మునిగిపోయారు . అయితే ఆ తల్లి తీసుకున్న కఠిన నిర్ణయానికి అభం శుభం తెలియని కూతురు కూడా ప్రాణాలు వదలాల్సి వచ్చింది. రమ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం... రమ్య మృతిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.