భర్తకు కరోనా.. భార్య ప్రియుడితో కలిసి.. పక్క గదిలో.. చివరికి..?
రోజు ఇంటికి వచ్చి పండ్లు ఇచ్చి వెళ్తున్న వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది . ఇక ఈ విషయం భర్త వరకు వెళ్లి భార్యను భర్త నిలదీయడంతో ఏకంగా భర్తపై దాడి చేసేందుకు కూడా వెనకాడలేదు సదరు భార్య. ప్రియుడితో కలిసి భర్త పై విచక్షణ రహితంగా దాడి చేసింది భార్య. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. కాకినాడ పాత బస్టాండ్ సెంటర్ న్యూ వెంకటేశ్వర కాలనీకి చెందిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడ్డారు.
ఇక ఆయన హోం ఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే అదే ప్రాంతానికి చెందిన రాజేష్ అనే వ్యక్తి రోజు పండ్లు తీసుకు వచ్చి ఇచ్చేవాడు. అయితే భర్త కరోనా వైరస్ బారిన పడ్డాడు అని భార్య విచారం చెందకుండా రోజు పండ్లు తీసుకొని ఇంటికి వస్తున్న వ్యక్తితో అక్రమ సంబంధానికి తెరలేపింది. భర్తకు తెలియకుండా ఇద్దరూ రహస్యంగా రాసలీలలు సాగించడం మొదలుపెట్టారు. చివరికి ఈ విషయం ఓ రోజు భర్తకు తెలిసిపోయింది.
ఇక రోజు లాగానే తన ఇంటికి వచ్చిన రాజేష్ తో గొడవకు దిగాడు భర్త. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే భార్య భర్త వైపు మాట్లాడకుండా ప్రియుడికి వంత పాడింది. మాటలతో ఆగకుండా ఏకంగా ప్రియుడితో కలిసి భర్త పైన చేయి చేసుకుంది భార్య. విచక్షణరహితంగా కొట్టడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు భర్త. వెంటనే స్పందించిన స్థానికులు భర్తని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.