దారుణం : స్నేహితున్ని చివరికి అమాయకున్ని చేసి చంపేశాడు..?
వివరాల్లోకి వెళితే... ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన వెంకన్న 10 సంవత్సరాల క్రితం కేసముద్రం మండలం వచ్చి కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇక అదే మండలానికి చెందిన హరీష్ కు వెంకన్న తో పరిచయం ఉంది. అయితే గత కొంత కాలం నుంచి తన ఇంటి పక్కన ఉన్న గోపాల్ అనే వ్యక్తితో స్థల వివాదం ఏర్పడింది. ఇక ఆ ఇంటి స్థలాన్ని ఎలాగైనా కాజేయాలని భావించిన హరీష్ ఇందుకోసం గోపాల్ ని భయపెట్టాలని అనుకున్నాడు.
దీంతో పక్కా ప్లాన్ వేసాడు హరీష్. తనకు పరిచయస్తుడు అయిన వెంకన్నకు వెనక ముందు ఎవరూ లేరు అని భావించి... గోపాల్ కళ్ళముందే వెంకన్నను హతమాచరిస్తే గోపాల్ తీవ్రంగా భయంతో ఊగిపోయి స్థలాన్ని తనకు ఇస్తాడు అని పన్నాగం పన్నాడు. గోపాల్ వెంకన్నను పిలిచి హరీష్ వారితో కలిసి మద్యం సేవించాడు. ఆ తర్వాత హరీష్ వెంకన్నను దారుణంగా హత్య చేసి తల మొండెం వేరు చేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.