గోదావరిలో దూకిన వ్యక్తి.. అసలు కారణం తెలిసి షాకైన పోలీసులు..?

praveen
ఈ మధ్య కాలంలో మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో ఏకంగా ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు ఎంతోమంది. మరికొంతమంది క్షణికావేశంలో నిర్ణయాలతో బలవన్మరణానికి పాల్పడి ఎంతో విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో చివరికి కుటుంబంలో తీరని విషాదం నిండిపోతుంది. ఇక్కడ ఇలాంటి ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చిన్న కారణాలకే ఓ వృద్ధుడు గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.



 అతన్ని  గమనించిన అగ్నిమాపక సిబ్బంది ఎంతో కష్టపడి ప్రాణాలను కాపాడారు. అయితే వృద్ధుడు ఆత్మహత్య యత్నం చేయడానికి గల కారణం తెలిసి అధికారులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఆ వృద్ధున్ని  కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే... రాజమండ్రి తాడితోట కు చెందిన అప్పారావు భార్యాపిల్లలతో ఉంటున్నాడు. అయితే గత కొద్దిరోజుల నుంచి భార్యాభర్తలు ఇద్దరూ ఈ మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇక ఇటీవల ఆదివారం సాయంత్రం సమయంలో కూడా భార్యతో గొడవ జరిగింది. ఇక  తరచూ భార్య గొడవలు పడుతుండడంతో తీవ్ర మనస్తాపం చెందాడు.  బలవన్మరణానికి పాల్పడాలని  నిర్ణయించుకున్నాడు.



 గోదావరి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు . నేరుగా ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి చేరుకున్న సదరు వృద్ధుడు... రేవు దగ్గరికి చేరి అందరూ చూస్తుండగానే గోదావరిలో దూకాడు. దీంతో అక్కడే ఉన్న అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. వరద ప్రవాహానికి గోదావరిలో  కొట్టుకుపోతున్న క్రమంలో... కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక దుంగ  కనిపించడంతో దాన్ని పట్టుకొని దాని పై కూర్చున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే 100 కు కాల్ చేసి సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని అగ్నిమాపక సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. ఇక రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది గోదావరి మధ్యలో ఉన్న  అప్పారావుకి లైఫ్ జాకెట్ తాడు విసిరారు. ఇక తాడును పట్టుకుని బయటికి వచ్చిన వృద్ధుడు భార్య  తిట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: