బ్రేకింగ్ న్యూస్: వివాదాస్పదమైన రెండో రాజధాని మేటర్..!

Suma Kallamadi
రాజకీయాలు ఎప్పుడు ఏరకంగా మలుపు తిరుగుతాయో ఎవరికీ అర్ధం కాదు. ఇక రాజకీయ నాయకుల సంగతి అసలే చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎలా మాట్లాడుతారో వారికే స్పృహ ఉండదు. రెండు నాల్కల ధోరణి వారి అభిమతంగా కనబడుతుంది. సరిగ్గా ఇక్కడ అలాంటిదే జరిగింది. ఇటీవల కాలంలో తమిళనాడు రాష్ట్రానికి రెండు రాజధానులు అనే అంశంపై చర్చ బాగానే వినబడింది.

ఇకపోతే, ఈ విషయం పైన అక్కడి మంత్రుల్లో భిన్నస్వరం వినబడుతోంది. ఇకపోతే తమిళనాడు రాష్ట్రంలో పరిపాలనా సౌకర్యం కోసం 2వ రాజధాని ఏర్పాటు చేయాలనే నినాదాన్ని రెవెన్యూ మంత్రి అయినటువంటి R B ఉదయ కుమార్‌ అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మంత్రి సెల్లూరు K రాజు దీనికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తిరుచ్చిని 2వ రాజధానిగా ప్రకటించాలని మంత్రి వెల్లమండి నటరాజన్‌ నినదించగా.. కాంగ్రెస్‌ mp తిరునావుక్కరసర్‌ దీనికి మద్దతు ఇవ్వడం కొసమెరుపు.

ఇక్కడ మంత్రి RB ఉదయ కుమార్‌ తన నినాదాన్ని cm పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దక్షిణ తమిళనాడులోని జిల్లాల్లో ఉన్న ఓటు బ్యాంక్‌ను టార్గెట్ గా చేసుకొని మదురైను రెండో రాజధానిగా ప్రకటించవచ్చనే సంకేతాలు కూడా ఒకసారి వినపడ్డాయి. ఈ విషయం తిరుచ్చి జిల్లాకు చెందిన అన్నా DMK మంత్రి వెల్లమండి నటరాజన్‌ కు నచ్చక మదురై కంటే, తిరుచ్చి అయితేనే బావుంటుంది అనే నినాదాన్ని అందుకోవడం జరిగింది.

దివంగత నేత MGR‌ గతంలోనే తిరుచ్చిని రెండో రాజధానిగా చేయాలని చూసారని, అయితే అప్పటి పరిస్థితుల ప్రభావంతో అది అమలుకు నోచుకోలేదని, అందుకే చెన్నై తర్వాత 2వ రాజధాని అంటే తిరుచ్చి అయితేనే బావుంటుందని మంత్రి నటరాజన్‌ బుధవారం నినాదాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని cm దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇక్కడ తిరుచ్చి నినాదానికి కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: