టిఆర్ఎస్ పార్టీలో చేసే ప్రతి పనికి ఓ ప్రణాళిక ఉంటుంది. ముందుగా తమ ప్రభుత్వ అధికారులను సిద్ధం చేసి అనుకున్న పనిని చేయడం మొదటినుంచి టిఆర్ఎస్ అమలు చేస్తున్న వ్యూహం.ఇప్పటివరకు జరిగిన వ్యవహారాలన్నీ గులాబీ పార్టీ ఇలాగే అమలు చేసింది. ఇటీవల కేటీఆర్ సీఎం అవుతారని చర్చ జోరుగా సాగుతోంది. చాలాసార్లు ఇదే చర్చ జరిగినా, ఈసారి ఒక అడుగు ముందుకేసి సీఎం స్థానంలో ఉండి చేయవలసిన పనులన్నీ మంత్రి కేటీఆర్ గారు చేస్తుండడంతో ఆయనే సీఎం అని ప్రజలందరూ అనుకొంటున్నారు.
దీంతో కేటీఆర్ తో ఉన్న నేతలు, పార్టీ కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు. దీంతో పార్టీలోని కేటీఆర్ అసంతృప్తులకు సీఎం అవుతారని పరోక్షంగా చెప్పినట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు ఆ రాష్ట్రాల సీఎం పర్యటించి అక్కడ వారి కష్టాలను తెలుసుకొని సాయం ప్రకటిస్తారు. ఏపీ తో సహా మిగిలిన అన్ని రాష్ట్రాలలో సీఎం లే వెళ్లి అక్కడ కార్యక్రమాలు చూస్తున్నారు. మరి సీఎం కేసీఆర్ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయం మీద కూడా ప్రజలకు చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే ఆయన ముందుగానే చెప్పినట్లుగా జాతీయ రాజకీయాలకు సిద్ధ పడుతున్నారని కొన్ని వర్గాల వారు చెబుతున్న సమాచారం.
ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ నగరానికి ఇటీవల వచ్చిన అకాల వర్షాలతో అపారమైన నష్టం వాటిల్లింది. అయితే సీఎం కేసీఆర్ వెళ్లి వారికి ధైర్యం చెప్పి నష్ట పరిహారం అందించాలి. కానీ ఇందుకు బదులుగా మంత్రి కేటీఆర్ అన్నీ తానై వ్యవహరించారు. సీఎంగా అధికారులను పరుగులు పెట్టించారు. దసరా లోపు అన్ని పనులను పూర్తి చేసి మళ్లీ వరంగల్ యథాస్థితికి తీసుకురావాలి అని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు అక్కడ ప్రజలకు ఉన్నపళంగా 25 కోట్లు నిధులు కేటాయించారు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో కేటీఆర్ తెలంగాణ సీఎం గా ప్రకటించబోతున్నట్లు రాజకీయ వర్గాలు మరియు మీడియా వర్గాలు చెప్పుకుంటున్నాయి.