కరోనా చంపలేదు.. కానీ ఆ ఇద్దరు చనిపోయారు.. ఎందుకంటే..?
మనస్తాపం చెంది మామ కోడలు బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది, వివరాల్లోకి వెళ్తే... పసుల మర్రయ్యకు ఇద్దరు కుమారుడు. పెద్ద కుమారుడు జోసెఫ్ నాలుగేళ్ల క్రితం పెద్దపల్లి జిల్లా కు చెందిన మానస అనే యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇక మరో చిన్న కొడుకు లివింగ్ స్టెన్ తన మరదలు వరస అయ్యే వదిన మానస చెల్లెలు రిచా ను ప్రేమించాడు . ఇక ఎన్నో ఏళ్ల పాటు వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. గుట్టుచప్పుడు కాకుండా నడిచిన వీరి ప్రేమ వ్యవహారం ఇటీవలే బట్టబయలు అయింది. రీచా ను తీసుకొని ఓ రోజు లివింగ్ స్టెన్ ఇంటికి వచ్చాడు.
రీచా ను లివింగ్ స్టెన్ ను చూసిన కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు, కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే మానస తీవ్ర మనస్థాపం చెందింది . ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు, అనంతరం తీవ్ర మనస్థాపం చెందిన మామ మర్రయ్య పక్కనే ఉన్న పశువుల కొట్టంలో ఉరివేసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.