తిరగబడుతున్న ఉగ్రవాదులు.. పాకిస్థాన్ లో మారణహోమం తప్పదా..?
ముఖ్యంగా భారతదేశంపై ఎప్పటికప్పుడు ఉగ్ర దాడులు జరుపుతూ మానసిక సంతృప్తి పడింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ప్రజల నిత్యవసర వస్తువుల విషయం లో... జీవన ప్రమాణాల పెంపు విషయంలో.. కావలసినటువంటి ఉపాధి అవకాశాలు.. విద్య వైద్యం విషయంలో ఏమీ పట్టించుకోకుండా కేవలం ఉగ్రవాదులతో విదేశా ల్లో దాడులు చేయడమే ముఖ్యంగా ప్రభుత్వం ముందుకు సాగింది. దీంతో పాకిస్తాన్ లో నిరక్షరాస్యత పెరిగిపోయి కనీస అభివృద్ధి కూడా జరగక ఆర్థిక సంక్షోభం లో కూరుకుపోయింది. అయితే చెడపకురా చెడేవు అనే విధంగా ప్రస్తుతం పాకిస్తాన్ లో పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలు ఒక్కటై ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు ప్రస్తుతం ఎలాంటి ఉపాధి పనులు లేకపోవడంతో.. పాకిస్థాన్ లో శిక్షణ తీసుకున్న ఉగ్రవాద సంస్థలు ఒక్కటై.. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ప్రస్తుతం ఉద్యమాలు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థలు ఒకటై పాకిస్తాన్ సైన్యం పైన దాడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కాగా ప్రస్తుతం పాకిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులు రానున్న రోజుల్లో ఎక్కడ వరకు దారి తీస్తాయి అన్నది ఆసక్తికరంగా మారింది.