మరో దశలోకి కరోనా మహమ్మారి... ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు...?
వీరిలో చాలామందిలో కరోనా సోకినా ఆ విషయం తెలియడం లేదని డబ్ల్యూహెచ్ఓ వెస్ట్రన్ పెసిఫిక్ రీజినల్ డైరెక్టర్ తకేషి కసయ్ చెప్పారు. కరోనా వైరస్ వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ముప్పు పొంచి ఉందని ఆయన అన్నారు. యువత, మధ్య వయస్కుల నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందడం అంటే కరోనా కేసులు పెరగడమే కాదు.. ఆసియా పసిఫిక్ రీజియన్‌లో మహమ్మారి నూతన దశలోకి మనం అడుగుపెట్టాం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల విషయంలో అప్రమత్తంగా ఉండాలనిచెప్పారు. కరోనా వైరస్ మ్యుటేషన్లను పరిశీలిస్తే వైరస్ ఇప్పటికీ స్టేబుల్ గానే ఉందని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తయారు చేసే సమయంలో రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్‌కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవలని సూచనలు చేశారు. ఆరోగ్యంగా ఉన్నామనుకుని యువత, మధ్య వయస్కులు వివిధ ప్రాంతాల్లో ప్రయాణించడం మూలాల కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని తెలిపారు.
ప్రజల మధ్య భౌతిక దూరం పాటిస్తూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాల ప్రజలు కరోనా మహమ్మారి ధాటికి చిగురుటాకులా వణుకుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలను అంటుకుంటోంది. దేశంలోని పల్లెల్లో సైతం పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం.