కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లు చేయకూడని తప్పులు ఇవే....?
కరోనా మహమ్మారి విషయంలో ఎవరైతే బయట తిరుగుతూ ఒత్తిడికి గురవుతూ ఉంటారో వాళ్లపై కరోనా దాడి అంత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా మనుషులను భయపెడుతోంది. అయితే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా బారిన పడే అవకాశాలు తగ్గడంతో పాటు వైరస్ సోకినా కరోనా నుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.
కరోనా ఇన్ఫెక్షన్ రెండు దశల్లో ఉంటుంది. రోగ నిరోధక శక్తి బలంగా ఉన్నవాళ్లలో రెండో దశ బారిన పడకుండానే బయట పడగలిగే అవకాశం ఉంటుంది. కరోనా నిర్ధారణ అయితే వైరస్ నుంచి కోలుకున్నా కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే మంచిదని లేకపోతే మన రోగ నిరోధక శక్తే మనకు నష్టం కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గుండె, మెదడు లాంటి కీలకమైన అవయవాలు సైతం ప్రభావితం అవుతాయని... మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఏర్పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లు ఎక్కువగా బయట తిరిగి అనంతరం వైరస్ నిర్ధారణ అయితే శ్వాస సంబంధిత సమస్యలు ఎదురైతే ఊపిరితిత్తులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకిన తరువాత హొం ఐసోలేషన్ ను సీరియస్ గా తీసుకోకపోతే మరింత ప్రమాదమని చెబుతున్నారు. శారీరకంగా గానీ, మానసికంగా గానీ విశ్రాంతి లేకపోవడం వల్ల వ్యాధి నిరోధక చర్యల నియంత్రణ (ఇమ్యూన్ రెగ్యులేషన్) ప్రభావవంతంగా పని చేయకపోవచ్చని కరోనా లక్షణాలు కనిపిస్తే బయట తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు.