ఆ విషయంలో చంద్రబాబును ఫాలో అవుతున్న జగన్...?

Reddy P Rajasekhar
2014 - 2019 టీడీపీ ఐదేళ్ల పాలనలో చంద్రబాబుపై ఏపీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అందువల్ల 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసింది. అయితే చంద్రబాబును ఎన్ని విషయాల్లో విమర్శించినా విజనరీ విషయంలో, టెక్నాలజీ విషయంలో చంద్రబాబు వ్యతిరేకులు సైతం ఆయనను ప్రశంసిస్తారు. చంద్రబాబు 2004కు ముందే టెక్నాలజీ సహాయంతో పరిపాలన సాగించి ప్రశంసలు అందుకున్నారు.
 
ఈ సేవా కేంద్రాలను ప్రవేశపెట్టి ఆ కాలంలోనే ప్రజలకు వాటి ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన సేవలు అందేలా చేశారు. ఆఫ్ లైన్ సర్వీసుల నుంచి ప్రజలను ఆన్ లైన్ సర్వీసుల వైపు చంద్రబాబు నడిపించారు. ఉమ్మడి ఏపీలో తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిజిటలైజేషన్ ను మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం విజనరీ, టెక్నాలజీని వినియోగించుకునే విషయంలో జగన్ ప్రజల మెప్పు పొందుతున్నారు.
 
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత నాడు నేడు పేరుతో గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. జగన్ గవర్నమెంట్ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయికి తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకు పథకాల అమలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. తాజాగా జగన్ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్ ను ప్రవేశపెట్టారు.
 
ఒకప్పుడు చంద్రబాబు ఏ విధంగా ముందుచూపుతో ఆలోచించారో జగన్ ఇప్పుడు అదే విధంగా ఆలోచిస్తూ ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నారు. సీఎం జగన్ నేడు గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ పేమెంట్స్‌ను ప్రారంభించారు. నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో గ్రామ, వార్డ్ సచివాలయల్లో యూపీఐ సేవలను కల్పించారు. వినియోగదారులు ఇక నుంచి గ్రామ, వార్డ్ సచివాలయ సేవలకు అవసరమైతే డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. జగన్ చంద్రబాబులా విజనరీ, టెక్నాలజీ విషయంలో ముందుకెళుతూ ఉండటంతో చంద్రబాబును జగన్ ఫాలో అవుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: