వారెవ్వా, ఇది మన పట్నమేనా?;నేడు జీవ వైవిధ్య సదస్సు

 హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణ వేత్తల్ని, జంతుప్రేమికులందరూ ఒకే వేదిక మీదకు రానున్నారు.జంతుప్రేమికులందరూ తమ మనసు విప్పి మాట్లాడుకోనున్నారు. అంతరించిపోతున్న ఈ జంతువుల్ని ఎలా కాపాడుకుందాం. తమ వంతుగా ఏం చేద్దామనీ జంతుప్రేమికులందరూ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసేందుకు గానూ నేటి నుంచి హైదరాబాద్ లో 19రోజుల పాటు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరగనున్నది. 2011-2020ని ఐక్యరాజ్యసమితి జీవ వైవిధ్య దశాబ్దంగా ప్రకటించిన నేపథ్యంలో మొట్టమొదటిసారిగా మన దేశంలో అది మన రాష్ర్టంలోని హైటెక్ సిటీ వేదికైంది. 19రోజుల పాటు జరిగే ఈ జీవ వైవిధ్య సదస్సుకు ప్రపంచంలోని 193దేశాల నుంచి 8వేల ప్రతినిధులు హాజరవుతున్నరు.  భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద సదస్సు జరగడం ఇదే మొట్టమొదటిసారి.దీనితో ఈ సదస్సును రాష్ర్ట ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదస్సు కోసం నగరం సరికొత్తగా ముస్తాబైంది. జీవం ఉట్టిపడే రంగుల చిత్రాల హంగులతో ఫ్లై ఓవర్లు మెరిసిపోతున్నాయి. దట్టమైన అడవుల్లో మాత్రమే తిరుగాడే బెంగాల్ తెల్ల పులులు, పచ్చని వాతావరణంలో పురివిప్పి నాట్యమాడే నెమళ్లు.. ఎడారుల్లో మాత్రమే కనిపించే ఒంటెలు.. అన్నీ ఇప్పుడు సిమెంట్ దిమ్మెలపై అందమైన చిత్రాలుగా మారి సందర్శకులను కనువిందు చేస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మన నగరాన్ని మనమే గుర్తుపట్టరాని విధంగా వివిధ రకాల పేయింటింగ్ తో మార్చేశారు. అయితే, ఇదిలా ఉంటే, జీవవైవిధ్య సదస్సులో ప్రపంచ జీవ వైవిధ్యం గురించి చర్చిస్తే....నిన్న నిర్వహించిన తెలంగాణ మార్చ్ లో ఈ ప్రాంతంలోని జీవ వైవిధ్యం గురించి, ఇక్కడ జరిగిన విధ్వంసం గురించి చర్చించుకుంటామనీ తెలంగాణవాదులు చేసిన విన్నపాలను పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రపంచంలో అంతరించుకుపోతున్న జీవుల గురించి ప్రపంచమంతా ఒక తాటిపైకి వచ్చి చర్చించుకుంటున్నప్పుడు తెలంగాణలో జీవ వైవిధ్యం ఎలా ధ్వంసమైందో వివరించాలనుకున్న జేఏసీ మార్చ్ పై ప్రభుత్వం ఉక్కుపాదాన్ని మోపిందనే చెప్పాలి. జీవ వైవిధ్య సదస్సులో ఏం చర్చిస్తారు? ప్రభు త్వం ఇస్తున్న ప్రకటనలు, గోడలపై వేస్తున్న బొమ్మలను గమనిస్తే ప్రక్రుతిపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు కనిపిస్తున్నది. పిట్టలు అంతరించిపోవడం వల్ల జరుగుతున్న నష్టాలేమిటి? పిట్టలు అంతరించిపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మన పులులు ఏమైపోతున్నాయి? మన జలాలు ఎలా కలుషితమవుతున్నాయి? మన పర్యావరణం ఎలా పాడైపోయింది? వీటిని నిరోధించి మళ్లీ పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవాలి? మన సంస్కృతి, సంప్రదాయాలను ఎలా నిలబెట్టుకోవాలి? జీవవైవిధ్య సదస్సుల్లో చర్చించే అంశాలు ఇవే కావచ్చు! కాకపోతే వీటికి ఏవో కొత్తపేర్లు పెట్టి రంగురంగుల బ్రోచర్లు వేసి ఆయా దేశాల్లో అంతరించిపోతున్న జీవవైవిధ్యంపై సమీక్షలు జరుపుతారు. ఏది ఏమైనా జీవ వైవిధ్యంపై ప్రభుత్వాలు ఖర్చుపెడుతున్న డబ్బులు పేదరిక నిర్మూలన కోసం ఖర్చు పెడితే కొంతవరకయిన పేదరిక నిర్మూలనను నిర్మూలించడానికి ఉపయోగపడేది. కానీ, ఏనాడై మన పాలకులు మంచి పని చేసేందుకు మనసు ఒప్పదు కదా? గవర్నర్ నరసింహన్ ప్రారంభోన్యాసంతో సదస్సు ప్రారంభమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: