బంగారం ధర భారీగా పడిపోయింది. గత కొన్ని రోజులుగా ర్యాలీ చేస్తూ వచ్చిన
పసిడి ఇప్పుడు పతనమైంది. రెండు రోజుల్లోనే నాలుగు వేల రూపాయలకు పైగా దిగొచ్చింది.
వెండి ధర కూడా ఇదే దారిలో నడుస్తోంది.
పసిడి పరుగుకు నెమ్మదిగా బ్రేకులు పడుతున్నాయి. గత కొంత కాలంగా పరుగులు పెడుతూ ఎవరికీ అందనంతగా.. దూసుకెళ్లిన బంగారు మూడు రోజుల నుంచి నెమ్మది నెమ్మదిగా దిగి వస్తోంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో
అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 3 శాతం పడిపోయింది. దాదాపు 2 వందల రూపాయల తగ్గుదలతో 10 గ్రాములకు 53 వేల 380 రూపాయలకు దిగొచ్చింది. గత సెషన్‌లో బంగారం ధర ఏకంగా 6 శాతం అంటే 3 వందల రూపాయలు పడిపోయింది. అంటే బంగారం ధర కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 4 వేల 5 వందలకు పైగా దిగొచ్చింది.
బంగారం ధర మాత్రమే కాకుండా
వెండి ధర కూడా పడిపోయింది.
వెండి ఫ్యూచర్స్ ధర కూడా 5 శాతం అంటే.. 5 వేల రూపాయలు క్షీణించింది. దీంతో కేజీ
వెండి ధర 61 వేల 972 స్థాయికి దిగొచ్చింది. కాగా గత వారంలో బంగారం ధర 56 వేల రూపాయలకు,
వెండి ధర 78 వేల రూపాయలకు చేరింది.
రష్యా
కరోనా వైరస్ వ్యాక్సిన్ ప్రకటనతో కోవిడ్ 19 భయాలు కొంత మేర తగ్గాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో పసిడిపై ప్రతికూల ప్రభావం పడింది. అలాగే
అమెరికా డాలర్ బలపడటం కూడా బంగారంపై ఒత్తిడిని పెంచాయి. మరోవైపు
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా
పసిడి పడిపోయింది. ఔన్స్‌కు 1928 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇంకేముందీ బంగారం అంటే తెగ మమకారం చూపించే మహిళలు జ్యూవెలరీ షాపులకు వెళ్లేందుకు సిద్ధమైపోతున్నారు.