కరోనా టైమ్ : మోడీ ని ట్రంప్ బలే వాడేస్తున్నాడుగా..?
అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో గతంలో కరోనా కేసుల విషయంలో అమెరికా ప్రభుత్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కరోనా టెస్టుల విషయంలో అమెరికా ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మొదటి స్థానంలో ఉందని.. అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఇక తాజాగా మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు నిర్వహించడంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత భారత్ రెండో ఉంది అంటూ వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇప్పటివరకు 65 మిలియన్ల కరోనా నిర్ధారిత పరీక్షలు చేశామని ఇది ప్రపంచంలో అత్యధికం అంటూ తెలిపారు.. భారతదేశంలో 138 కోట్ల జనాభా ఉండగా కేవలం 11 మిలియన్ టెస్ట్ లు నిర్వహించి రెండవ స్థానంలో ఉంది అంటూ డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా ఏ దేశం నిర్వహించ లేనటువంటి నాణ్యమైన కరోనా నిర్ధారిత పరీక్షలు అమెరికా నిర్వహించిందని.. కరోనా పరీక్షల విషయంలో ఏ దేశం కూడా అమెరికాను అందుకోలేదు అంటూ చెప్పుకొచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అంతేకాకుండా ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపిన ట్రంప్.. గత వారం రోజులలో 17 శాతం కేసులు, మరణాలు 7 శాతం తగ్గినట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే 30 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 52 లక్షల మందికి కరోనా వైరస్ సోకితే 138 కోట్ల జనాభా ఉన్న భారత్లో కేవలం 22 లక్షల కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని అయినప్పటికీ మోదీని డోనాల్డ్ ట్రంప్ వాడుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు అంటూ చెబుతున్నారు,