కొత్త సమస్య.. కరోనా తో మరో వ్యాధి.. వణికి పోతున్న జనాలు..?

praveen
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. వైరస్ ను కంట్రోల్ చేసేందుకు ప్రపంచ దేశాలు ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ  ఎక్కడా ఈ మహమ్మారి వైరస్ విలయతాండవం మాత్రం ఆగడం లేదు. ప్రతిరోజు మారణకాండ కొనసాగిస్తూ ఎంతో మంది ప్రజలను ప్రాణాలు బలి  తీసుకుంటుంది. రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక అగ్రరాజ్యాలలో  అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పిల్లలు పెద్దలు యువకులు అనే తేడా లేకుండా అందరినీ కబలిస్తుంది ఈ కరోనా  వైరస్. వెరసి  రోజురోజుకు మహమ్మారి వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది.



 ఇదిలా ఉంటే తాజాగా అమెరికాలో జరిపిన ఓ పరిశోధనలో మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చి అందరికీ గుబులు పుట్టిస్తోంది. ఇటీవల అమెరికాలో 600 మంది పిల్లలు అరుదైన వ్యాధితో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు  తెలుస్తుంది. వారిలో తీవ్రమైన జ్వరం లాంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన వారు ఎక్కువ మంది ఉన్నారట. అయితే ఆ సిండ్రోమ్ వ్యాధి  రావడానికి కారణం కరోనా  వైరస్ వ్యాక్సిన్ అంటూ డాక్టర్లు తేల్చి చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక అమెరికాలోని వ్యాధుల నియంత్రణ చర్యలు సంస్థ కూడా ఈ విషయాన్ని చెప్పడంతో అక్కడి ప్రజల్లో  మరో భయం పట్టుకుంది.



 ప్రస్తుతం కరోనా  వైరస్ ద్వారా వస్తున్న ఈ కొత్త వ్యాధిని మల్టీ సిస్టమ్  ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని అంటారట. జ్వరం చర్మంపై దద్దుర్లు లాంటి లక్షణాలు ఈ వ్యాధి సోకినప్పుడు కనిపిస్తాయట. అయితే ప్రస్తుతం అమెరికా లో కరోనా  వైరస్ వ్యాప్తి కూడా అధిక సంఖ్యలో ఉన్న తరుణంలో ఈ వ్యాధి  కూడా శరవేగంగా వ్యాప్తిచెందే  అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా  వైరస్ ద్వారా వస్తున్న ఈ కొత్త వ్యాధి గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పిల్లలను ఈ వ్యాధి నుంచి కాపాడవచ్చు అని తెలిపింది అమెరికా వ్యాధుల నియంత్రణ చర్యలు సంస్థ. కరోనా  వైరస్  తగ్గిన తర్వాత కూడా పిల్లల్లో ఆరోగ్య పరిస్థితిని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: