ఆంధ్రప్రదేశ్ లో మరొక అగ్ని ప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రతి నెలా ఏదో ఒక దుర్ఘటన జరగడం ప్రస్తుతం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. శుక్రవారం రాత్రి కేరళలో కూడా ఎయిర్ ఇండియా ల్యాండింగ్ సమయంలో అతి పెద్ద ప్రమాదం జరిగి 20 మంది పైచిలుకు ప్రయాణికులు అంత లోకాల్లో కలిసిపోయారు. బీరుట్ లో అమ్మోనియం నైట్రేట్ పేలుడు, సినీ ఇండస్ట్రీలో ప్రముఖుల మరణాలు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే 2020 వ సంవత్సరం అత్యంత విషాదకరమైన ఏడాదిగా మారిపోయింది. ఈరోజు ఉదయం పూట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ సంఘటన యాజమాన్యాల పూర్తి నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్పష్టమవుతుంది.
ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి 50 లక్షల రూపాయలను మృతుల కుటుంబాలకు ప్రకటించారు. అలాగే ఈ సంఘటన పై విచారణ జరపాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఏది ఏమైనా ఏపీ అధికారులు అగ్నిమాపక భద్రతా శాఖ నుండి సేఫ్టీ సర్టిఫికెట్ పొందినివారికి కూడా కొవిడ్-19 కేర్ సెంటర్ పెట్టుకునేందుకు అనుమతులు యథేచ్ఛగా ఇస్తున్నారు. వీరిపై కఠినమైన చర్యలు తీసుకుంటే గాని ఇకపై ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కావని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వర్ణ ప్యాలెస్ ఘటనలోని నిందితులను ఎలా శిక్షిస్తారో చూడాలిక.